విద్యార్థులకు శుభవార్త: కేసీఆర్‌ కీలక నిర్ణయం

Midday Meals In Government Inter And Degree Colleges In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజీల భలోపేతం దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ కళాశాల్లో ఇప్పటికే అనేక సంస్కరణలు చేపట్టిన సర్కార్‌.. దానిలో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్ననికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీని వల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపవుట్స్ పెరిగిపోతున్నారని అధికారులు గతంలో సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై శుక్రవారం విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. కాలేజీల్లో భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల హాజరుశాతం పెరగాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. (ప్రభుత్వ విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తాం)

డ్రాపవుట్స్‌ నివారించడంతో పాటు, విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. జడ్చర్ల డిగ్రీ కాలేజీలో బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి సంబంధించిన చర్చ వచ్చిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, అక్కడి ప్రభుత్వ లెక్చరర్ రఘురామ్ తమ సొంత ఖర్చులతో జూనియర్ కాలేజీ విద్యార్థులకు భోజనం పెడుతున్న సమాచారం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని సీఎం చెప్పారు. లెక్చరర్ రఘురామ్ విజ్ఞప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నూతన భవనాన్ని కూడా ముఖ్యమంత్రి మంజూరు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top