స్కూల్ కి వెళ్ళొస్తా, మమ్మీ బై అవే చివరి మాటలు | Medak Nanded passenger tragedy:It was the last goodbye by my child, says mother | Sakshi
Sakshi News home page

స్కూల్ కి వెళ్ళొస్తా మమ్మీ బై అవే చివరి మాటలు

Jul 24 2014 1:56 PM | Updated on Nov 9 2018 4:45 PM

స్కూల్ కి వెళ్ళొస్తా, మమ్మీ బై అవే చివరి మాటలు - Sakshi

స్కూల్ కి వెళ్ళొస్తా, మమ్మీ బై అవే చివరి మాటలు

నిర్లక్ష్యం, అజాగ్రత్త, అలసత్వం, బాధ్యతా రాహిత్యం ఇవే మెదక్ జిల్లాలో పెను విషాదానికి కారణం.

హైదరాబాద్ :  నిర్లక్ష్యం, అజాగ్రత్త, అలసత్వం, బాధ్యతా రాహిత్యం  ఇవే మెదక్ జిల్లాలో పెను విషాదానికి కారణం. లెవల్ క్రాసింగ్‌ల దగ్గర గేట్లు ఏర్పాటు చేయడంలో రైల్వే శాఖ నిర్లక్ష్యం,  బస్సు డ్రైవర్ అజాగ్రత్త 20 మంది విద్యార్ధులను  బలిగొన్నాయి. అధికారమే తప్ప  బాధ్యత తెలియని అధికారగణం నిర్లక్ష్యానికి అభం, శుభం తెలియని చిన్నారులు మూల్యం చెల్లించుకున్నారు.

నాన్న స్కూల్ కి వెళ్శొస్తాను, మమ్మీ బై అన్న పలుకులే చివరి మాటలుగా మారాయి. తమ బిడ్డల ముద్దు ముద్దు మాటలతో మురిసిపోయిన ఆ తల్లిదండ్రులకు ...అవే వారి ఆఖరి మాటల కావటంతో బాధితులను  ఓదార్చటం ఎవరి తరం కావటం లేదు. అదే తన చిన్నారి ఆఖరి మాటలు అంటూ ఓ తల్లి గుండెలు పగిలేలా రోదించటం చూసేవారిని కంటతడి పెట్టించింది. కాగా  శుక్రవారం మెదక్ జిల్లాలో పాఠశాలలకు జిల్లా విద్యాశాఖ సెలవు ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement