ఎవరికీ భయపడేది లేదు.. | Medak MP kotha Prabhakar Reddy warrnings to the Srisailam Goud | Sakshi
Sakshi News home page

ఎవరికీ భయపడేది లేదు..

Jan 4 2015 12:58 AM | Updated on Oct 8 2018 7:43 PM

ఎవరికీ భయపడేది లేదు.. - Sakshi

ఎవరికీ భయపడేది లేదు..

ఎవరేమిటో మాకు తెలుసు... భయపెట్టిస్తే భయపడం...అందరి బ్యాక్‌గ్రాండ్ మా వద్ద ఉంది..

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
తూప్రాన్: ‘ఎవరేమిటో మాకు  తెలుసు... భయపెట్టిస్తే భయపడం...అందరి బ్యాక్‌గ్రాండ్ మా వద్ద ఉంది..  నీతో ఇలా ఎవరు మాట్లాడిస్తున్నారో అదీ తెలుసు’ అంటూ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఓ టీఆర్‌ఎస్ కార్యకర్తపై మండిపడ్డారు. శనివారం తూప్రాన్ మండల సర్వ సభ్య సమావేశం జరిగింది. సమావేశానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  గ్రామ పంచాయతీలవారీగా సీసీ రోడ్ల కోసం మంజూరైన నిధుల వివరాలను  గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు వివరించారు.

ఈ నిధుల ద్వారా సర్పంచ్, ఎంపీటీసీలు కలిసి సమన్వయంతో పనులు చేసుకోవాలని సూచించారు. అలాగే కార్యకర్తలను కలుపుకుపోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెబుతుండగా టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు శ్రీశైలంగౌడ్ సమావేశ మందిరంలోకి చొచ్చుకువచ్చారు. కార్యకర్తలకు న్యాయం జరుగడంలేదని, నాయకులు పట్టించుకోవడంలేదని, తమకు కూడా పార్టీ తరఫున పనులు కేటాయించాలని డిమాండ్ చేయడంతో సమావేశంలో కొద్దిగా ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎంపీ, శ్రీశైలంగౌడ్‌ను హెచ్చరించారు. వెంటనే పోలీసులు శ్రీశైలంగౌడ్‌తో పాటు టీఆర్‌ఎస్ నేతలను బయటకు పంపించి వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement