నగరంలో భారీ చోరీ | massive theft in hyderabad | Sakshi
Sakshi News home page

నగరంలో భారీ చోరీ

Apr 12 2015 2:40 PM | Updated on Sep 3 2017 12:13 AM

మాదన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామ్‌చందర్‌నగర్‌లో భారీ చోరీ జరిగింది.

హైదరాబాద్: మాదన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామ్‌చందర్‌నగర్‌లో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళాన్ని రంపంతో కోసి లోపలికి ప్రవేశించిన దొంగలు సుమారు 30 తులాలు బంగారం, 20 తులాల వెండి, రూ.20 వేల నగదును అపహరించుకుపోయారు. స్థానికంగా నివాసం ఉండే విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి మహ్మద్ అఫ్జల్ తన తల్లి పింఛన్ కోసం శుక్రవారం రాత్రి మెదక్ వెళ్లారు.

 ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించి దొంగలు చోరీకి పాల్పడ్డారు. శనివారం ఉదయం ఇంటి తాళం తీసి ఉండడాన్ని గుర్తించిన పాలుపోసే వ్యక్తి స్థానికులకు తెలుపగా, వారు పోలీసులకు సమాచారాన్ని అందించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement