జ్యువెలరీ షాపులో భారీ చోరీ.. | Massive Theft In Jewelry Store At Secunderabad | Sakshi
Sakshi News home page

జ్యువెలరీ షాపులో భారీ చోరీ

Jan 16 2021 10:32 AM | Updated on Jan 16 2021 10:35 AM

Massive Theft In Jewelry Store At Secunderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్ మార్కెట్‌ పీఎస్ పరిధిలోని జ్యువెలరీ షాపులో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. శుక్రవారం తెల్లవారు జామున రూ.21.30 లక్షల విలువైన 1.2 కేజీల బంగారం, వెండి ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. షాపు యాజమాని డ్రైవర్‌ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. స్నేహితులతో కలిసి డ్రైవర్‌ చోరీకి స్కెచ్ వేసినట్లు నిర్థారించారు. డ్రైవర్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement