మహబూబ్ నగర్ జిల్లా పెద్దపల్లి వద్ద పెళ్లి బృందం ప్రయాణిస్తున్న లారీ బోల్తా పడటంతో 25 మంది గాయపడ్డారు.
పెళ్లివేడుకకు బయలుదేరిన లారీ బోల్తా పడటంతో 25 మంది గాయపడ్డారు. పెద్దపల్లి గ్రామానికి చెందిన మొగిళి శివయాదవ్‌కు బిజ్నాపల్లి మండలం మంగనూరు గ్రామానికి చెందిన విజయలక్ష్మితో ఆదివారం మధ్యాహ్నం వివాహం జరగాల్సి ఉంది. ఉదయం మంగనూరు నుంచి బంధువులు లారీలో బయలుదేరి వస్తుండగా పెద్దపల్లి గ్రామ సమీపంలో బోల్తాపడింది.
రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ తీగలను గమనించిన లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయటమే ఈ ప్రమాదానికి కారణమని బాధితులు తెలిపారు. ఈ సంఘటనలో పెళ్లి బృందంలోని నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరో 20మందికి స్వల్ప గాయాలు కాగా వారికి స్థానికంగా చికిత్స చేయించారు. అయితే, వివాహ వేడుకకు ఎలాంటి ఆటంకం కలుగలేదు.