సాంగ్స్‌తో ఆదరగొట్టిన బన్ని, నాని

Allu Arjun and Nani Singing In Friends Marriage - Sakshi

టాలీవుడ్‌ హీరోలు అల్లు అర్జున్‌, నాని స్నేహానికి ఎంత విలువ ఇస్తారో తెలిసిన విషయమే. బన్ని ఓ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌ బహుమతిగా ఇచ్చిన జాకెట్‌ ధరించి తాను స్నేహానికి ఎంత విలువ ఇస్తాడో తెలిపారు. అలాగే నాని కూడా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో స్నేహంగా వ్యవహరిస్తారు. పలు హీరోల చిత్రాల ప్రమోషన్స్‌లో పాల్గొంటూ వారి మధ్య స్నేహాన్ని వ్యక్తపరిచారు. కానీ ఇప్పడు బన్ని, నానిలు కలిసి ఓ వేడుకలో చేసిన సందడి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలు చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

బన్ని, నానిల కామన్‌ ఫ్రెండ్‌ వివాహ వేడుకలో వీరు ఇలా ఎంజాయ్‌ చేసినట్టుగా తెలుస్తోంది. బన్ని, నానిలు కలసి ఎటో వెళ్లి పోయింది మనసు’ చిత్రంలోని ‘ ప్రియతమా నీ వచట కుశలమా..’ అని పాడుతూ సందడి చేశారు. ఆ తర్వాత బన్ని ఆర్య2 చిత్రంలోని ‘ఉప్పెనంత ఈ ప్రేమ..’కు పాటను ఆలపిస్తూ.. తన భార్య స్నేహరెడ్డితో కలిసి స్టెప్పులేస్తూ ఎంజాయ్‌ చేశారు. నాని తన భార్య అంజనాతో కలిసి నిన్నుకోరి చిత్రంలోని ‘అడిగా, అడిగా..’ సాంగ్‌ పాడారు. బన్ని, నానిలు ఇలా పాటలు పాడుతుంటే అక్కడున్న వారంతా గోల చేస్తూ ఎంజాయ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడొచ్చు..

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top