సరిహద్దులో మావోయిస్టులు | Maoists at border | Sakshi
Sakshi News home page

సరిహద్దులో మావోయిస్టులు

Nov 14 2014 3:36 AM | Updated on Oct 9 2018 2:51 PM

సరిహద్దులో మావోయిస్టులు - Sakshi

సరిహద్దులో మావోయిస్టులు

మండల సరిహద్దులోకి మావోయిస్టులు చేరుకున్నట్టు తెలిసింది.

దుమ్ముగూడెం : మండల సరిహద్దులోకి మావోయిస్టులు చేరుకున్నట్టు తెలిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన గౌరారం-పైడిగూడెం గ్రామాల మధ్య మూడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు పోలీసుల పహరా నడుమ నెల రోజుల నుంచి శరవేగంగా సాగుతున్నారుు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు మావోయిస్టులు విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో వెంకటాపురం, శబరి ఏరియా కమిటీలతోపాటు మావోయిస్టు మిలీషియా ప్లాటూన్ కమాండర్ సుఖదేవ్ ఆధ్వర్యంలో మావోయిస్టు మిలటరీ ప్లాటూన్ బలగాలు బుధవారం అర్ధరాత్రి దుమ్ముగూడెం మండల సరిహద్దులోకి వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రాచలం ఏఎస్పీ ఆదేశాలతో రోడ్డు నిర్మాణ ప్రదేశం నుంచి పోలీసు బలగాలు రాత్రికి రాత్రే వెనుదిరిగారుు. నిర్మాణ పనులకు సంబంధించిన వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement