breaking news
Sabari Area Committee
-
రహదారిపై మావోల వాల్పోస్టర్లు
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దేవరపల్లి ప్రధాన రహదారిపై గురువారం ఉదయం మావోయిస్టుల వాల్ పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు పార్టీ చర్ల శబరి ఏరియా కమిటీ పేరిట ఈ పోస్టర్లు ఉన్నాయి. ఈనెల 21 నుంచి 27 వరకు సీపీఐ(మావోయిస్టు) పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాలను ప్రజలు గ్రామగ్రామాన నిర్వహించాలని మావోయిస్టులు ఈ పోస్టర్లలో కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. -
సరిహద్దులో మావోయిస్టులు
దుమ్ముగూడెం : మండల సరిహద్దులోకి మావోయిస్టులు చేరుకున్నట్టు తెలిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన గౌరారం-పైడిగూడెం గ్రామాల మధ్య మూడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు పోలీసుల పహరా నడుమ నెల రోజుల నుంచి శరవేగంగా సాగుతున్నారుు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు మావోయిస్టులు విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఛత్తీస్గఢ్ సరిహద్దులో వెంకటాపురం, శబరి ఏరియా కమిటీలతోపాటు మావోయిస్టు మిలీషియా ప్లాటూన్ కమాండర్ సుఖదేవ్ ఆధ్వర్యంలో మావోయిస్టు మిలటరీ ప్లాటూన్ బలగాలు బుధవారం అర్ధరాత్రి దుమ్ముగూడెం మండల సరిహద్దులోకి వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రాచలం ఏఎస్పీ ఆదేశాలతో రోడ్డు నిర్మాణ ప్రదేశం నుంచి పోలీసు బలగాలు రాత్రికి రాత్రే వెనుదిరిగారుు. నిర్మాణ పనులకు సంబంధించిన వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు.