నారాయణపూర్‌లో వ్యక్తి హత్య | man murder in adilabad distirict | Sakshi
Sakshi News home page

నారాయణపూర్‌లో వ్యక్తి హత్య

Jun 17 2015 9:40 AM | Updated on Jul 30 2018 8:29 PM

ఆదిలాబాద్ జిల్లా రెబ్బన మండలం నారాయణపూర్‌లో గుర్తితెలియని వ్యక్తులు దుర్గం వెంకటయ్య(40) అనే వ్యక్తిని హత్యచేశారు.

రెబ్బన: ఆదిలాబాద్ జిల్లా రెబ్బన మండలం నారాయణపూర్‌లో గుర్తితెలియని వ్యక్తులు దుర్గం వెంకటయ్య(40) అనే వ్యక్తిని హత్యచేశారు. ఈ సంఘటన బుధవారం వేకువజామున జరిగింది. గ్రామ శివారులో వెంకటయ్య మృతదేహం పడిఉండగా ఉదయం గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుని శరీరంపై గాయాలున్నాయని, గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు. రెబ్బన పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement