కల్తీ కల్లు తాగి ఒకరి మృతి | Man dies of electric short circuit in Nalgonda | Sakshi
Sakshi News home page

కల్తీ కల్లు తాగి ఒకరి మృతి

Feb 26 2015 1:08 AM | Updated on Sep 2 2017 9:54 PM

నల్లగొండ జిల్లా భువనగిరి మండల బాలంపల్లిలో మంగళవారం రాత్రి కల్తీ కల్లు తాగి ఒకరు మృతిచెందగా మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

 కల్తీ కల్లు, కల్లెం పుష్పమ్మ,
మరో ఐదుగురి పరిస్థితి విషమం

నల్లగొండ(భువనగిరి): నల్లగొండ జిల్లా భువనగిరి మండల బాలంపల్లిలో మంగళవారం రాత్రి కల్తీ కల్లు తాగి ఒకరు మృతిచెందగా మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన దూడల పెద్దమల్లయ్యగౌడ్ వద్ద కాశపాక మల్లేశ్, కాశపాక స్వామి, కాశపాక ఉపేంద్ర, కల్లెం పుష్పమ్మ కల్లెం కళమ్మ, ఆమె కుమారుడు దుర్గాప్రసాద్ కల్లు తాగారు. అయితే రాత్రి ఎనిమిది గంటల సమయంలో వీరికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కాశపాక మల్లేశ్(42) మృతిచెందాడు. మిగిలిన వారిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కల్లెం పుష్పమ్మ పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement