బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి లారీ కిందపడి వ్యక్తి మృతి చెందాడు.
నల్లగొండ టౌన్: బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి లారీ కిందపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం నల్లగొండ పట్టణంలోని రామగిరిలో జరిగింది. వివరాలు.. రామగిరిలో వ్యాపారం చేసే చంద్రయ్య బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ముందుటైర్ స్కిడ్ అవ్వడంతో కిందపడ్డాడు. అయితే, అదే సమయంలో అటు నుంచి వస్తున్న లారీ వెనుక టైర్ల కింద పడటంతో నుజ్జునుజ్జయ్యాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.