నిజామాబాద్ జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలో శనివారం మంత్రి కే. తారకరామారావు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది.
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలో శనివారం మంత్రి కే. తారకరామారావు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఆయన రాక సందర్భంగా నిర్వహిస్తున్న బైక్ ర్యాలీలో ఓ టీఆర్ఎస్ కార్యకర్త చనిపోయాడు. దోమకొండ మండలం బీబీపేట్‌కు చెందిన చాట్ల మహంకాళి(50) బైక్‌ర్యాలీలో పాల్గొన్నాడు. అయితే ప్రమాదవశాత్తూ బైక్ నుంచి కిందపడి పోవటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ అతను మరణించాడు.
(బిక్నూర్)