విద్యుద్ఘాతంతో యువకుడి మృతి | man died due to current shock | Sakshi
Sakshi News home page

విద్యుద్ఘాతంతో యువకుడి మృతి

Mar 14 2015 3:43 PM | Updated on Sep 2 2017 10:51 PM

ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫ్యూజులను సరిచేస్తున్న ఓ కార్మికుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

తలకొండపల్లి : ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫ్యూజులను సరిచేస్తున్న ఓ కార్మికుడు విద్యుద్ఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలం చీపునుంతలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... చీపునుంత గ్రామానికి చెందిన గుమ్మడి శేఖర్ (22) విధుల్లో భాగంగా శనివారం ఉదయం గ్రామ శివారులోని 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫ్యూజులను సరిచేయడానికి వెళ్లాడు. ఆ క్రమంలో విద్యుద్ఘాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

 

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ అజీజుల్లా తెలిపారు. శవాన్ని ఫోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ట్రాన్స్‌కో ఏఈ రమేశ్‌తో పాటు ఉపసర్పంచ్ చెన్నకేశవులు తదితరులు సందర్శించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement