రెండేళ్ల తర్వాత ఇంటికి మృతదేహం | man die in soudhi dead body come home two years later | Sakshi
Sakshi News home page

రెండేళ్ల తర్వాత ఇంటికి మృతదేహం

Feb 2 2016 2:34 AM | Updated on Jul 30 2018 8:29 PM

రెండేళ్ల తర్వాత ఇంటికి మృతదేహం - Sakshi

రెండేళ్ల తర్వాత ఇంటికి మృతదేహం

రెండేళ్ల క్రితం సౌదీలో హత్యకు గురైన వ్యక్తి మృతదేహం సోమవారం ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం రామారావుపేటలోని స్వగ్రామానికి వచ్చింది.

జైపూర్: రెండేళ్ల క్రితం సౌదీలో హత్యకు గురైన వ్యక్తి మృతదేహం సోమవారం ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం రామారావుపేటలోని స్వగ్రామానికి వచ్చింది. గ్రామానికి చెందిన నూతి రామయ్య- సుశీల కుమారుడు నూతి సత్యనారాయణ(26) 2011లో బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లాడు. కాగా, సత్యనారాయణకు లాటరీలో రూ. 20 లక్షలు వచ్చినట్లు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు.

రెండు రోజుల తర్వాత.. 2013 సెప్టెంబర్ 12న తాను ఉంటున్న గదిలోనే హత్యకు గురయ్యాడు. అయితే, తల్లిదండ్రులు కొడుకును కడసారి చూసుకోవాలని భావించి.. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన స్వచ్ఛంద సంస్థ సభ్యుడు షేక్ చాంద్‌పాషాను సంప్రదించారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించాలన్న  వినతిని మెయిల్ చేశారు.

అయితే, సత్యనారాయణది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన అక్కడి పోలీసులు.. విచారణ చేపట్టారు. చివరికి సత్యనారాయణ రూమ్‌లో ఉండే వ్యక్తి చేతిలోనే హత్యకు గురయ్యాడని నిందితుడికి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో మృతదేహం స్వగ్రామానికి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement