ప్రేమ విఫలం..యువకుడి ఆత్మహత్య


ఘట్‌కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం మాధవ రెడ్డి బ్రిడ్జి కింద రైల్వే ట్రాక్ వద్ద ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయిన యువకుడు బోడుప్పల్‌కు చెందిన విజయ్‌కుమార్‌(25)గా గుర్తించారు. విజయ్‌ స్వస్థలం నాగర్‌ కర్నూల్‌ జిల్లా తుర్కపల్లి మండలం బాపల్లి గ్రామం. సంఘటనాస్థలంలో సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. ప్రేమ విఫలం కావడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top