నగల కోసం అయిదురు మహిళలను హతమార్చి, అనంతరం దహనం చేసిన కేసులకు సంబంధించి నిందితుడిని సిద్ధిపేట పోలీసులు అరెస్ట్ చేశారు.
మెదక్ : నగల కోసం అయిదురు మహిళలను హతమార్చి, అనంతరం దహనం చేసిన కేసులకు సంబంధించి నిందితుడిని సిద్ధిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సలీంతో పాటు హత్యలకు సహకరించిన మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 13 తులాల బంగారం, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఆరు నెలలుగా జిల్లాలో ఐదుగురు మహిళలు హత్యగావించబడిన విషయం తెలిసిందే.
కాగా సలీంను పోలీసులు వారం రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే విచారణ అనంతరం శనివారం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. నగల కోసమే మహిళలను హత్యచేసి, దహనం చేసినట్లు సలీం విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా హత్యగావించబడిన మహిళలు ఎవరనేది పోలీసులు ఆరా తీస్తున్నారు.