పురుగులమందు తాగి ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది.
ప్రేమజంట బలవన్మరణం
Apr 12 2016 8:06 PM | Updated on Nov 6 2018 7:56 PM
తిప్పర్తి (నల్లగొండ) : పురుగులమందు తాగి ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో ఆలస్యంగా మంగళవారం వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లో కి వెళ్తే.. మిర్యాలగూడ మండలం జాప్తివీరప్పగూడేనికి చెందిన సండ్రల నవనీత (21), నిడమనూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన జక్కలి నరేష్ (21) మిర్యాలగూడలోని ఓ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నారు. రెండేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు.
వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో నవనీతకు ఈ నెల 2న వేరే వ్యక్తితో వివాహం జరిపించారు. దీంతో మనస్తాపానికి గురయ్యారు. ఈ నెల 7న ఇళ్ల నుంచి వెళ్లిపోయి తిప్పర్తి మండలం మాడ్గులపల్లి సమీపంలో గల రైల్వేట్రాక్ పక్కన ఉన్న బత్తాయి తోటలో కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తోటలో రెండు మృతదేహాలు పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Advertisement
Advertisement