
రజనీతో మాట్లాడుతున్న ఈటెల రాజేందర్
నమ్మించి గర్భవతిని చేసిన ప్రియుడు పిల్లి శ్రీకాంత్‌తో తనకు వివాహం జరిపించి న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించిన ఉప్పరపల్లి రజిని ఆందోళన రెండోరోజుకు చేరింది.
సముద్రాల ప్రధాన రహదారిపై ధర్నా
‘ఈటెల’ హామీతో ఆందోళన విరమణ
కోహెడ : నమ్మించి గర్భవతిని చేసిన ప్రియుడు పిల్లి శ్రీ కాంత్‌తో తనకు వివాహం జరిపించి న్యాయం చేయాలని కోహెడ మండలం సముద్రాలలో ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించిన ఉప్పరపల్లి రజిని రెండోరోజు కూడా ఆందోళన కొనసాగించింది. ఆమెకు శనివారం కూడా మహిళా సంఘాలు, గ్రామస్తులు సంపూర్ణ మద్ద తు ప్రకటించి శ్రీకాంత్ ఇంటి ఎదుట వంటావార్పు ని ర్వహించారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు.
ఎస్సై సతీష్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలికి న్యాయం చేస్తామని, ఆందోళన విరమించాలని కోరినా ప్రయోజనం లేకుండాపోయింది. అదే సమయంలో సిద్దిపేట నుంచి హుస్నాబాద్ వైపు హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వెళ్తున్నారు. రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోవడంతో ఆయన వచ్చి రజినితో మాట్లాడారు. డీఎస్పీతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
అయితే కేసును రాజకీయ ఒత్తిడితో పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారని, శ్రీకాంత్‌తో తన పెళ్లి జరిగే వరకూ పోరాడుతూనే ఉంటానని రజిని స్పష్టం చేసింది. రజినికి మద్దతు తెలిపిన వారిలో మహిళా సంఘాల ప్రతినిధులు గూడెం లక్ష్మి, వనజ, సర్పంచ్ బొల్లం రవి, గ్రామస్తులు ఉన్నారు.