ఆ నలుగురు..కరువయ్యారు!

Lockdown People Avoiding Funerals Nizamabad - Sakshi

చావు’ దెబ్బకొట్టిన కరోనా’

బంధువులున్నా.. అంత్యక్రియలకు రాలేని పరిస్థితి

డప్పుకొట్టేవారూ లేరు పరామర్శలకూ వెళ్లలేని దుస్థితి

సాక్షి, కామారెడ్డి: ఒక్కడై రావడం.. ఒక్కడై పోవడం విధిలీల.. తుదివేళ ఏ బంధమూ వెంట రాదు. బంధువులు, బలగం ఎంతమందున్నా.. వెంట నడిచేది కాటివరకే.. కానీ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ‘కరోనా’ నీడలో చావు కూడా భారంగా మారింది. పార్థివదేహాన్ని శ్మశానానికి మోసుకెళ్లేందుకు ఆ నలుగురు కూడా రాని పరిస్థితి దాపురించింది. రక్తసంబంధీకులు, ప్రాణానికి ప్రాణమైన స్నేహితులు, బంధువులు ఎవరూ అంత్యక్రియలకు వెళ్లలేకపోతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆంక్షలు అమలు అవుతున్నాయి. గుంపులుగా ఒకేచోటుకు చేరితే వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీంతో అంత్యక్రియలపైనా ఆంక్షలున్నాయి. కరోనా వైరస్‌ గురించి అవగాహన పెరగడంతో ప్రజలు సైతం చావులకు వెళ్లడం లేదు.

బంధువో, స్నేహితుడో చనిపోయాడని తెలిస్తే పరుగున వెళ్లేవారంతా ఇప్పుడు వెనకాముందవుతున్నారు. కొందరు ఏదైతే అది జరగని అంటూ చివరి చూపు చూడాలనే ఆరాటం ఉన్నా వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు. లాక్‌డౌన్‌ మూలంగా రవాణా పూర్తిగా స్థంభించిపోయింది. రోడ్లపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. రోడ్లపై వాహనాలు తిరిగితే చాలు పోలీసులు పట్టుకుని సీజ్‌ చేస్తున్నారు. ఒక్క వైద్యం కోసం తప్ప మరే దానికీ పోలీసులు అనుమతించడం లేదు. దీంతో చావులకు కూడా వెళ్లలేకపోతున్నారు. రక్త సంబంధీకుడు చనిపోయినా సరే వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో కనీసం పరామర్శలకు వెళ్లడానికీ సాహసించడం లేదు. చివరి చూపు చూడాలన్న ఆవేదనను దిగమింగుకుని ఇంటి దగ్గరే నాలుగు కన్నీటిబొట్లు రాలుస్తున్నారు.

పాడె మోసే వారు లేరు..
ఎవరైనా చనిపోయినపుడు డప్పు చప్పుళ్ల మధ్య పాడెను సిద్ధం చేస్తారు. నలుగురు ఆ పాడెను మోస్తారు. రక్త సంబంధీకులు, స్నేహితులు, బంధువులు కూడా తలా ఓ చేయి వేస్తారు. దారిపొడవునా పాడె చేతులు మారుతూ ఉంటుంది. తొలుత పాడె ఎత్తిన చేతులు తిరిగి దించే సమయంలోనూ ఉండాలి. అయితే ఇప్పుడు పాడె మోసేవారు లేకుండాపోయారు. ఎవరు చనిపోయినా దగ్గరి వాళ్లు కూడా రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. చాలా మంది వైకుంఠ రథాలలోనే తీసుకెళ్తున్నారు. కుటుంబ సభ్యులే పాడెను లేపి రథంలో ఉంచుతున్నారు. రథం వెనుకా, ముందూ ఎవరూ కనిపించడం లేదు. 

డప్పు కొట్టే వారూ రావట్లేదు!
చావు డప్పు కొట్టడానికి చాలా ప్రాంతాల్లో ఎవరూ ముందుకు రావడం లేదు. అలాగే ఖననం చేసేందుకు గుంత తీయడం, కాడి పేర్చడానికి కూడా మనుషులు దొరకడం లేదు. ఎందుకంటే చావుకు వెళితే కరోనా ఎక్కడ తమను అంటుకుంటుందోనన్న భయం వారిని వృత్తికి దూరం చేస్తోంది. కొన్ని  గ్రామాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో చావు డప్పుకు వెళ్తున్నా, చాలా చోట్ల నిరాకరిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లోనైతే పాడె కట్టెవారు కూడా రావడం లేదని తెలుస్తోంది.‘స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్‌’ అని ఆకలిరాజ్యం సినిమాలో సినీ గేయ రచయిత రాసినట్లుగా శుభకార్యాల్లోలాగానే అంతిమ యాత్రల్లోనూ ఆ ర్భాటాలు చేయడం సాధారణమైపోయింది. అయితే కరోనాతో పరిస్థితి మారిపోయింది. బలగం, బంధువులు ఉన్నా.. లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా అంత్యక్రియలకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అంతిమ యాత్రలో పాడె మోసేందుకు ఆ నలుగురూ కరువవుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

03-06-2020
Jun 03, 2020, 12:00 IST
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్నప్పటికి వైరస్‌ వ్యాప్తి ఏమాత్రం తగ్గడంలేదు. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 2...
03-06-2020
Jun 03, 2020, 11:13 IST
జడ్చర్ల: మండలంలోని మల్లెబోయిన్‌పల్లికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ వ్యక్తి...
03-06-2020
Jun 03, 2020, 08:49 IST
బీజింగ్‌: కరోనా వైరస్‌ గురించి ప్రపంచాన్ని హెచ్చరించిన కంటి వైద్యుడు లి వెన్లియాంగ్‌తో కలిసి వుహాన్‌ సెంట్రల్‌ ఆస్పత్రిలో పని...
03-06-2020
Jun 03, 2020, 08:38 IST
గాంధీఆస్పత్రి: కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ప్రమాదం త్రుటిలో తప్పింది. తిరుగుతున్న సీలింగ్‌ ఫ్యాన్‌ హఠాత్తుగా ఊడి...
03-06-2020
Jun 03, 2020, 08:26 IST
స్నేహితులతో కలిసి జనవరిలో ఆఫ్రికాకు వెళ్లి మార్చి 20న హైదరాబాద్‌కు వచ్చాను. మార్చి 31న గాంధీ ఆస్పత్రికి వైద్య పరీక్షల...
03-06-2020
Jun 03, 2020, 08:01 IST
ప్రతిష్టాత్మకమైన జాతీయ, అంతర్జాతీయ పర్యటనలనునిర్వహించే ఐఆర్‌సీటీసీ కోవిడ్‌ దెబ్బకు కుదేల్‌ అయింది.లాక్‌డౌన్‌ కారణంగా ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలు పూర్తీగా రద్దయ్యాయి. ప్రస్తుతం...
03-06-2020
Jun 03, 2020, 04:41 IST
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతంతో పోల్చితే రాష్ట్రంలో ఆ సంఖ్య చాలా ఎక్కువగా...
03-06-2020
Jun 03, 2020, 04:30 IST
సాక్షి, అమరావతి:  కరోనా నియంత్రణలో దేశానికే ఆంధ్రప్రదేశ్‌ రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. కేసులు ఎన్ని వస్తున్నాయన్నది కాకుండా, వైరస్‌ను కట్టడి చేయడమే...
03-06-2020
Jun 03, 2020, 03:33 IST
సాక్షి, హైదరాబాద్‌: దగ్గు.. జ్వరం.. ముక్కు కారటం.. శ్వాసకోశ సంబంధ సమస్యలే కరోనా లక్షణాలని భావించాం.. కానీ ఒక్కోసారి వాంతులు,...
02-06-2020
Jun 02, 2020, 18:35 IST
న్యూఢిల్లీ: శానిటైజ‌ర్‌.. క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత మ‌హా న‌గ‌రం నుంచి మారుమూల ప‌ల్లె వ‌ర‌కు ఇది వాడ‌ని వారే లేరంటే అతిశ‌యోక్తి...
02-06-2020
Jun 02, 2020, 16:34 IST
సొంత రాష్ట్రం చేరుకున్న వలస కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కండోమ్‌లను పంపిణీ చేస్తోంది.
02-06-2020
Jun 02, 2020, 16:32 IST
 సాక్షి, విజయవాడ :  లాక్‌డౌన్‌ కారణంగా సుమారు రెండు నెలల తరువాత రైళ్లు, విమానాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది....
02-06-2020
Jun 02, 2020, 15:57 IST
ఇస్లామాబాద్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ కట్టడికై విధించిన లాక్‌డౌన్‌ను త్వరలోనే ఎత్తివేయనున్నట్లు పాకిస్తాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించారు....
02-06-2020
Jun 02, 2020, 15:50 IST
తొలి కరోన కేసు బయట పడినప్పటికీ ఎపిడమాలోజిస్ట్‌లను సంప్రదించి, తగిన చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరిగిందని నివేదిక పేర్కొంది. 
02-06-2020
Jun 02, 2020, 14:51 IST
సాక్షి, చెన్నై : తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు...
02-06-2020
Jun 02, 2020, 14:44 IST
సాక్షి, ‘కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ సందర్భంగా వలస కార్మికులు క్షేమంగా ఇళ్లకు చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బస్సులను, ప్రత్యేక రైళ్లను...
02-06-2020
Jun 02, 2020, 14:13 IST
అనుమతి ఇవ్వండి.. యుద్దంలో గెలిచి చూపిస్తాను
02-06-2020
Jun 02, 2020, 13:58 IST
సాక్షి, న్యూఢిల్లీ:  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాస్పిటల్ బెడ్స్, ఇతర సమాచారం కోసం  ‘‘ఢిల్లీ కరోనా" యాప్ ను...
02-06-2020
Jun 02, 2020, 13:20 IST
అచ్చంపేట: కరోనా వైరస్‌ వ్యాధితో పట్టణవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం పట్టణంలోని మధురానగర్‌కాలనీలో పాజిటివ్‌ కేసు నమోదు కావటంతో ఆ...
02-06-2020
Jun 02, 2020, 13:08 IST
జెనీవా:  కరోనా వైరస్‌​ ఇక  తమ దేశంలో లేదంటూ  ప్రకటించిన ప్రముఖ ఇటాలియన్ వైద్యుడు వాదనలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top