నాటుసారా తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు.
నడిగూడెం : నాటుసారా తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. సిరిపురం గ్రామానికి చెందిన జంపాల బిక్షం(45) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, శుక్రవారం ఉదయం నుంచి నాటు సారా తాగుతుండటంతో దాహం వేసింది.
ఈ క్రమంలో అతనికి అందుబాటులో నీళ్లు లేకపోవడంతో మృతి చెందాడు. దీంతో గ్రామంలోని కొందరు వ్యక్తులు నాటుసారా విక్రయాలను నిలిపివేయాలని ఆందోళనకు దిగారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.