ఇద్దరు బాల కార్మికులకు విముక్తి | liberation from child labour | Sakshi
Sakshi News home page

ఇద్దరు బాల కార్మికులకు విముక్తి

May 18 2015 3:11 PM | Updated on Sep 3 2017 2:17 AM

ఇద్దరు బాల కార్మికులకు విముక్తి

ఇద్దరు బాల కార్మికులకు విముక్తి

ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో ఇద్దరు బాల కార్మికులకు కార్మిక శాఖ అధికారులు విముక్తి కల్పించారు.

ఖానాపూర్ : ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో ఇద్దరు బాల కార్మికులకు కార్మిక శాఖ అధికారులు విముక్తి కల్పించారు. సహాయ కేంద్రానికి వచ్చిన ఫిర్యాదు మేరకు సహాయ కార్మిక శాఖ అధికారి ముత్యం రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం రెండు దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ హోటల్‌లో పనిచేస్తున్న బాలుడ్ని, కూరగాయల దుకాణంలో పనిచేస్తున్న మరో బాలుడ్ని గుర్తించారు. వారికి విముక్తి కల్పించి వారితో పనిచేయిస్తున్న వ్యాపారస్థులకు షోకాజు నోటీసులు జారీ చేశారు. రూ.20 వేల చొప్పున జరిమానా విధించారు. విముక్తి కలిగిన ఇద్దరిలో ఒకరు ఖానాపూర్ మండలం మక్కాపూర్‌కు చెందిన బాలుడు కాగా, మరో బాలుడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వాడని గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement