16 మంది బాల కార్మికులకు విముక్తి | libaration from child labour | Sakshi
Sakshi News home page

16 మంది బాల కార్మికులకు విముక్తి

May 20 2015 2:08 PM | Updated on Sep 3 2017 2:23 AM

నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కింగ్‌కాలనీలోని ఓ వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న బాలలకు పోలీసులు బుధవారం విముక్తి కల్పించారు.

హైదరాబాద్: నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కింగ్‌కాలనీలోని ఓ వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న బాలలకు పోలీసులు బుధవారం విముక్తి కల్పించారు. డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు సదరు వాటర్‌ప్లాంట్‌పై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ వెట్టిచాకిరీ చేస్తున్న 16 మంది బాలలను గుర్తించి, బాలల సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. ప్లాంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement