‘రేవంత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం’ | 'Let's Win Revantreddi with a Big Majority' | Sakshi
Sakshi News home page

‘రేవంత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం’

Nov 27 2018 9:42 AM | Updated on Mar 18 2019 9:02 PM

 'Let's Win Revantreddi with a Big Majority' - Sakshi

కోస్గిలో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

సాక్షి, కోస్గి: కొడంగల్‌ ఎమ్మెల్యేగా రేవంత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సోమవారం పట్టణంలో మాజీ వార్డు సభ్యుడు తుడుం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీసీ కాలనీతోపాటు బిజ్జారం బావుల కాలనీలో ప్రచారం చేశారు. రేవంత్‌రెడ్డిని మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


మైనార్టీ సెల్‌ ఆధ్వర్యంలో.. 
కాంగ్రెస్‌ మండల మైనార్టీ సెల్‌ ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని పట్టణంలోని మోమిన్‌పేట కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, ముస్లిం, మైనార్టీలు రేవంత్‌రెడ్డికి మద్దతుగా ఉండి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

కార్యక్రమంలో మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఇద్రీస్, కోఆప్షన్‌ మెంబర్‌ ఆసీఫ్, రహీంపాష, నాయకులు మక్సూద్, సలీం, ఇలియాస్, ఫేరోజ్, ఖలీం తదితరులు ఉన్నారు. 


మద్దూర్‌లో.. 
మద్దూరు: మండల కేంద్రంలో, కొత్తపల్లిలో కాంగ్రెస్‌ నాయకులు సోమవారం ఇంటింటి ప్రచారాన్ని చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2లక్షల రుణమాఫీ, రూ.5లక్షలతో ఇంటి నిర్మాణం, రూ.2లక్షలతో కల్యాణలక్ష్మి పథకం, 7 కిలోల సోనా బియ్యం ఇవ్వనున్నారని తెలిపారు.

అభివృద్ధి చూసి హస్తం గుర్తుకు ఓటేయాలన్నారు. కార్యక్రమంలో మురళిధర్‌రెడ్డి, వెంకట్‌రాములుగౌడ్, బాల్‌రాజ్, మహిపాల్, గణప చందు, సుభాష్, సంజీవ్, రామకృష్ణ, భీములు, సలాం, శేఖర్, నర్సిరెడ్డి, బారి, కన్కప్ప, సురేందర్‌ పాల్గొన్నారు.అదేవిధంగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు రమేష్‌రెడ్డి, సుభాష్‌నాయక్, శివరాజ్, చంద్రశేఖర్, వెంకట్‌రాములుగౌడ్‌ ఆధ్వర్యంలో చింతల్‌దిన్నెకు చెందిన వీరప్ప, నీలప్ప, మొగులప్ప, గండెప్ప, మల్లప్ప, గోవిందు, ఆంజనేయులు, వెంకటయ్య, హన్మయ్య, రాములు, అంజప్ప, మొగులప్ప తదితరులు కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు గ్రామానికి చెందిన పార్టీ నాయకులు రాంచందర్, వెంకట్‌రెడ్డి, వెంకటేష్‌ తెలిపారు.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement