ఖమ్మం జిల్లాలో బుధవారం ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో బుధవారం ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామానికి చెందిన శంకరమ్మ(22) అనే యువతి కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో ఆమె కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతితో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది.