‘ల్యాబ్‌టెక్నీషియన్ల సమస్యలు పరిష్కరించండి’ | Lab Technicians Urge To Resolve Problems | Sakshi
Sakshi News home page

‘ల్యాబ్‌టెక్నీషియన్ల సమస్యలు పరిష్కరించండి’

Feb 28 2018 2:15 AM | Updated on Feb 28 2018 2:15 AM

Lab Technicians Urge To Resolve Problems - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న ల్యాబ్‌టెక్నీషియన్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ల్యాబోరేటరీ టెక్నీషియన్స్‌ అసోసియేషన్‌ కోరింది. ల్యాబ్‌టెక్నీషియన్‌ గ్రేడ్‌–1 పోస్టుల పదోన్నతుల కోసం వెంటనే సీనియారిటీ జాబితాను ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు మంగళవారం అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు హరినాథ్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌లు ప్రజారోగ్య విభాగం డైరెక్టర్, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌లతో సమావేశమయ్యారు. పదోన్నతులు లేకపోవడంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ల్యాబ్‌టెక్నీషియన్లు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 50 జూనియర్‌ అనలిస్టు పోస్టులను అర్హత కలిగి ఉన్న ల్యాబ్‌టెక్నీషియన్లకు పదోన్నతి ద్వారా ఇవ్వాలని కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement