
ఇలాగాంధీతో కుప్పురాం
బంజారాహిల్స్: వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏబీ కుప్పురాంకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం అరుదైన అవకాశం కల్పించింది. జూలై 26న సౌతాఫ్రికాలోని పీటర్‌మార్టిజ్‌బర్గ్ నగరంలో ప్రారంభమైన ‘గాంధీ–మండేలా యూత్ సింపోజియం’లో మాట్లాడే అవకాశం ఆయనకు దక్కింది. ఈ మేరకు పీటర్‌మార్టిజ్‌బర్గ్ గాంధీ మెమోరియల్ కమిటీ డిప్యూటీ చైర్‌పర్సన్ బన్నీబూలా ఆహ్వానం పంపగా.. జూలై 23న ఆయన సౌతాఫ్రికాకు వెళ్లారు. ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య సత్సంబంధాలు నెలక్పొలే దిశగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనే అవకాశం లభించడంపై కుప్పురాం ఆనందం వ్యక్తం చేశారు. ఇదొక ప్రతిష్టాత్మక సదస్సు అని పేర్కొన్నారు. సందర్శనలో భాగంగా ఆయన గాంధీ మనవరాలు ఇలాగాంధీని కలుసుకున్నారు. ఆమె దక్షిణాఫ్రికాలో పొలిటిషియన్, యాక్టివిస్ట్.