నగరంలో మంత్రి కేటీఆర్‌ ఆకస్మిక పర్యటన

KTR Sudden Visit in Hyderabad on Coronavirus Awareness - Sakshi

నిరుపేద కూలీ కుటుంబానికి చేయూత

అంబర్‌పేటలోని నైట్‌ షెల్టర్‌ తనిఖీ

వివిధ అంశాలపై కలెక్టర్‌ శ్వేతామహంతికి దిశానిర్దేశం

సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌ డౌన్‌ ప్రకటించిన తరువాత నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం హైదరాబాద్‌ నగరంలో ఆకస్మికంగా పర్యటించారు. మొదట ప్రగతి భవన్‌ నుంచి బుద్ధభవన్‌కు వెళ్తుండగా దారిలో రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్న నిరుపేద కుటుంబాన్ని పలకరించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన కుటుంబం పనిచేసేందుకు ఉపాధి లేక కాలినడకన వేళ్తుండటంతో ఉప్పల్‌ వరకు వెళ్లడానికి తన సిబ్బందికి చెప్పి వాహనాన్ని ఏర్పాటు చేశారు. అలాగే అక్కడే కనిపించిన బీహార్‌కు చెందిన ఓ కార్మికుడు, తాను అనాథను అని, తనకు చూసుకోవడానికి ఎవరూ లేరని మంత్రికి చెప్పిన వెంటనే,  జీహెచ్‌ఎంసీ నైట్‌ షెల్టర్‌ అతనికి బస ఏర్పాటు చేయాలని, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ శంకరయ్యను ఆదేశించారు.

బుద్ద భవన్‌ సందర్శన
బుద్ధ భవన్‌లో ఉన్న విపత్తు నిర్వహణ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్‌ సందర్శించారు. హైదరాబాద్‌ మహానగరంలో డిజాస్టర్‌ రెస్పాన్స్‌ టీంలు కొరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపై ఎంఫోర్స్‌మెంట్‌– డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ను అడిగి తెలుసుకున్నారు. అక్కడే కంట్రోల్‌ రూమ్‌లో ఉన్న సిబ్బందిని వారి రోజువారీ పని గురించి వాకబు చేశారు. మంత్రితో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కూడా ఉన్నారు. జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను కూడా మంత్రి సందర్శించారు. వివిధ సమస్యలపై కంట్రోల్‌ రూంకు వస్తున్న ఫిర్యాదులను జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్‌ కలెక్టర్‌లను అడిగి తెలుసుకున్నారు. ఈ సెంటర్‌లో ఉన్న సిబ్బందికి మంత్రి వివిధ సూచనలను చేశారు. వివిధ సమస్యలపైన వచ్చే కాల్స్‌ను మానవతా దృక్పథంతో స్పందించాలని సూచించారు. అనంతరం గోల్నాకలోని జీహెచ్‌ఎంసీ నైట్‌ షెల్టర్‌ను మంత్రి సందర్శించారు. అందుబాటులో ఉన్న వసతులను అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. నైట్‌ షెల్టర్‌లోని అర్హులైన ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులకు ఆసరా పెన్షన్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతిని ఆదేశించారు. అక్కడ పక్కనే ఉన్న కాలనీలో పర్యటించి కాలనీలోని ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లల్లోంచి బయటకు రావద్దని, ఎవరూ భయపడవద్దని, ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. డిజాస్టర్‌ రెస్పాన్స్‌ టీంలు నిరంతరం చేపడుతున్న క్రిమి సంహారక మందు స్ప్రే కార్యక్రమాన్ని ఎర్రగడ్డలో పర్యవేక్షించారు.

నిత్యావసర సరుకుల కోసం పలువురి సేవలు వినియోగించుకోవాలి...
నిత్యావసర సరుకుల కోసం అమెజాన్, ప్లిప్‌ కార్ట్, గ్రోఫరŠస్స్, బిగ్‌ బాస్కెట్‌ వంటి వాటి సేవలను ఉపయోగించుకునేలా, వారి సిబ్బందిని లాక్‌ డౌన్‌ సందర్భంగా నియంత్రించకుండా చూడాలని తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డికి మంత్రి కేటీఆర్‌ సూచించారు. వారి సరుకుల పంపిణీ కార్యకలాపాలు పునఃప్రారంభం అయ్యేలా చూడాలన్నారు. నగరంలో పెద్ద ఎత్తున కొనసాగుతున్న భవన నిర్మాణాలు, ఇతర మౌలిక వసతులు పనుల్లో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికుల యోగక్షేమాలు, వసతులుపై తర్వరలోనే భవన నిర్మాణ సంఘాలతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. అప్పటిదాకా వారికి వసతికి, ఆహారానికి ఇబ్బందులు లేకుండా చూడాలని కేటీఆర్‌ సూచించారు. ప్రస్తుతం నగరంలోని హాస్టళ్లను మూసివేస్తుండటంతో వస్తున్న ఇబ్బందులపైన తగిన చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌లకు సూచించారు. నగరంలోని హాస్టళ్ల యాజమాన్యాలతో మాట్లాడి అందులో ఉంటున్న వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని అదేశించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

07-04-2020
Apr 07, 2020, 07:41 IST
కర్ణాటక, గంగావతి రూరల్‌: కొప్పళ నగరంలో లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి బైక్‌లపై బయట తిరిగే వారికి సోమవారం మంగళముఖిలు (హిజ్రాలు) వినూత్నంగా...
07-04-2020
Apr 07, 2020, 07:24 IST
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయం మహాదీపం కొండపై చైనా యువకుడు దాగి ఉన్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో గాలింపులు...
07-04-2020
Apr 07, 2020, 07:17 IST
చిత్తూరును రెడ్‌ జిల్లాగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు త్వరగా,ఎక్కువగా విస్తరిస్తున్న 96...
07-04-2020
Apr 07, 2020, 04:47 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాటంలో నిధులను సమకూర్చుకునే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,...
07-04-2020
Apr 07, 2020, 04:40 IST
సాక్షి, అమరావతి: వేసవిలో నిరాటంకంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌...
07-04-2020
Apr 07, 2020, 04:34 IST
న్యూఢిల్లీ: ఏప్రిల్‌ 14 తరువాత లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి సంకేతాలిచ్చారు. దేశవ్యాప్తంగా వైరస్‌...
07-04-2020
Apr 07, 2020, 04:17 IST
ప్రాణాంతక కరోనా వైరస్‌ను ఇవర్‌మెక్టిన్‌  అనే మందు 48 గంటల్లోనే మట్టుబెడుతున్నట్లు మొనాశ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనం...
07-04-2020
Apr 07, 2020, 04:10 IST
లండన్‌/పారిస్‌/వాషింగ్టన్‌: కోవిడ్‌–19 మహమ్మారికి కళ్లెం పడుతోందా? చైనాలో పుట్టి ప్రపంచమంతా విస్తరించిన కరోనా వైరస్‌తో తీవ్రంగా నష్టపోయిన ఇటలీ, స్పెయిన్‌లలో...
07-04-2020
Apr 07, 2020, 03:58 IST
మహిళల టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరడం కాకుండా ఈ టోర్నీ ద్వారా భారత జట్టుకు జరిగిన మరో మేలు ఒక...
07-04-2020
Apr 07, 2020, 03:41 IST
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో నిత్యావసర వస్తువుల కొనుగోలు సమయంలో ప్రజలు ఎన్నో...
07-04-2020
Apr 07, 2020, 02:49 IST
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో కరోనా అనుమానితుడు కొద్దిసేపు కనిపించకుండాపోయిన ఘటన కలకలం సృష్టించిం ది. అతడి సెల్‌ఫోన్‌...
07-04-2020
Apr 07, 2020, 02:44 IST
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ (కోవిడ్‌–19)ను కట్టడి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట వ్యూహంతో ముందుకు...
07-04-2020
Apr 07, 2020, 02:30 IST
ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా మరో 51 కేసులు...
07-04-2020
Apr 07, 2020, 02:29 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఏ ఒక్కరూ ఆకలి బాధ పడకూడదని.. రేషన్‌ కార్డు ఉన్నా, లేకున్నా బియ్యం పంపిణీ చేస్తామని...
07-04-2020
Apr 07, 2020, 02:20 IST
సాక్షి, అమరావతి: వ్యవసాయం, ఉత్పత్తులు, మార్కెటింగ్, ధరలపై వారంలో ప్రత్యేక యాప్‌ రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు....
07-04-2020
Apr 07, 2020, 02:14 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పారిశుధ్య సిబ్బందికి కోత విధించిన వేతనాలను తిరిగి చెల్లిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. వారికి అదనంగా...
07-04-2020
Apr 07, 2020, 02:14 IST
కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్త విధానాలకు ఐసీఎంఆర్‌ అనుమతివ్వడంతో ప్రాథమిక స్థాయి పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఏర్పడింది. దీని ప్రకారం...
07-04-2020
Apr 07, 2020, 02:04 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా భయం ఇంటింటిని తాకింది. బయటకు వెళ్తే వైరస్‌ వస్తుందన్న భయానికి తోడు ఇంటి పట్టునే ఉంటున్నా.....
07-04-2020
Apr 07, 2020, 01:58 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి సంబంధించి అమెరికాకు చెందిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) వేర్వేరు స్థితులను...
07-04-2020
Apr 07, 2020, 01:42 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి ఐటీ రంగానికి శాపంగా మారింది. ఏటా సుమారు లక్ష కోట్లకుపైగా ఐటీ ఎగుమతులు సాధిస్తున్న...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top