రంగారెడ్డి జిల్లాలో భారీ లాజిస్టిక్‌ పార్కు | KTR lay foundation to logistic park in rangareddy district | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి జిల్లాలో భారీ లాజిస్టిక్‌ పార్కు

Oct 6 2017 4:36 PM | Updated on Oct 6 2017 4:36 PM

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలో భారీ లాజిస్టిక్స్‌ పార్క్‌కు మంత్రులు కె.తారకరామారావు, మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

సాక్షి, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలో భారీ లాజిస్టిక్స్‌ పార్క్‌కు మంత్రులు కె.తారకరామారావు, మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 22 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ పార్కులో సుమారు 750 ట్రక్కులను అంకన్‌ పార్క్ లో ఉంచడానికి వీలుంటుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ట్రక్కుల సిబ్బందికి విశ్రాంతి గదులు, హాస్పిటల్ వంటి సదుపాయాలు ఉన్నాయన్నారు.

పార్కింగ్ కోసం అన్ని రకాల సదుపాయాలు కల్పించారని తెలిపారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో బాటసింగారంలో రూ. 35 కోట్లతో 40 ఎకరాల విస్తీర్ణంలో మరో లాజిస్టిక్స్‌ పార్కును కూడా నిర్మించనున్నారు. కార్యక్రమంలో ఎంపీ బుర్ర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, పార్క్ ఎం.డి రాజశేఖర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement