కాబోయే సీఎం ఆయనే : కోమటిరెడ్డి | komatireddy rajagopal reddy comments over next chief minister of telangana | Sakshi
Sakshi News home page

కాబోయే సీఎం ఆయనే : కోమటిరెడ్డి

Feb 22 2017 5:01 PM | Updated on Aug 14 2018 11:02 AM

కాబోయే సీఎం ఆయనే : కోమటిరెడ్డి - Sakshi

కాబోయే సీఎం ఆయనే : కోమటిరెడ్డి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం అయ్యేది సీఎల్పీ నేత జానారెడ్డేనని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు.

నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి అయ్యేది సీఎల్పీ నేత జానారెడ్డేనని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి జోస్యం చెప్పారు. నల్లగొండలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో చాలెంజ్ చేసి మరీ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకున్నామన్నారు.

కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు, కార్యకర్తలు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్లో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు పట్టుబట్టడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందన్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్లిన ప్రతీ నాయకుడు తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి క్యూ కడతారన్నారు. కోదండరాంను అరెస్ట్ చేసిన తీరును చూస్తే సీఎం కేసీఆర్‌కు రోజులు దగ్గర పడ్డాయని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పటికైనా సీఎం అయ్యేది నేనే అని చెబుతుంటే... ఆయన సోదరుడు రాజగోపాల్‌ రెడ్డి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement