రాష్ట్రావిర్భావం రోజు బహిరంగ సభ | Komati Reddy Venkata Reddy public meeting on State emergence day | Sakshi
Sakshi News home page

రాష్ట్రావిర్భావం రోజు బహిరంగ సభ

Mar 21 2017 2:59 AM | Updated on Sep 5 2017 6:36 AM

రాష్ట్రావిర్భావం రోజు బహిరంగ సభ

రాష్ట్రావిర్భావం రోజు బహిరంగ సభ

రాష్ట్రావిర్భావాన్ని పురస్కరించుకుని జూన్‌ 2న భారీ బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తున్నట్లు సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రావిర్భావాన్ని పురస్కరించుకుని జూన్‌ 2న భారీ బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తున్నట్లు సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అసెంబ్లీ లాబీల్లో సోమవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడింది, ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనన్నారు. కాంగ్రెస్‌పై తెలంగాణవాదులు, ప్రజల్లో సానుభూతి ఉందన్నారు.

రాష్ట్ర ఏర్పాటు కోసం సోనియా పట్టుదలను ప్రజల్లోకి తీసుకుపోతామని, దీనికి టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తే బాగుంటుందని, అనుమతివ్వకుంటే నల్లగొండలోనే నిర్వహిస్తామన్నారు. సోనియా, రాహుల్‌ను సభకు ఆహ్వానిస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement