కేసీఆర్‌ మరో చండీయాగం! | komati reddy rajagopal reddy fired on cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ మరో చండీయాగం!

Feb 24 2017 3:08 AM | Updated on Mar 18 2019 9:02 PM

కేసీఆర్‌ మరో చండీయాగం! - Sakshi

కేసీఆర్‌ మరో చండీయాగం!

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కోమటిరెడ్డి బ్రదర్స్‌ భయం పట్టుకుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

మాకు పీసీసీ పదవి రాకుండా చేసేందుకే..: రాజగోపాల్‌ రెడ్డి
తిప్పర్తి: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కోమటిరెడ్డి బ్రదర్స్‌ భయం పట్టుకుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తమకు పీసీసీ అధ్యక్ష పదవి రాకుండా కేసీఆర్‌ మరో చండీయాగం చేసేందుకు సిద్ధం అవుతున్నారని చెప్పారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సోదరుడు, ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌ రెడ్డి మాట్లా డుతూ, రాష్ట్ర ప్రజలంతా కోమటిరెడ్డి సోదరుల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పా రు.

తాము పాదయాత్ర చేస్తే 2019లో కాంగ్రెస్‌ వంద సీట్లు గెలుచుకుని అధికారం లోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరిన ఎంపీ, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధం అవుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. మరో రెండేళ్లలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, కాంగ్రెస్‌తోనే రైతు రాజ్యాన్ని తీసుకువస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement