‘కమిషనరేట్‌ అక్కడ నిర్మించొద్దు’ | Kodandaram says Do not build Commissionerate in VM Home place | Sakshi
Sakshi News home page

‘కమిషనరేట్‌ అక్కడ నిర్మించొద్దు’

Oct 4 2017 7:48 PM | Updated on Jul 29 2019 2:51 PM

Kodandaram says Do not build Commissionerate in VM Home place - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్‌ హోం స్థలంలోని పదెకరాలను రాచకొండ కమిషనరేట్‌కు కేటాయించారు. జారీ చేసిన  జీవోను రద్దు చేయాలని విక్టోరియా హోం భూముల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని జేఏసీ చైర్మన్‌ కొదండరాం సదర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వి.ఎం. హోం స్థలాన్ని అనాథ విద్యార్థుల కోసం విద్యా అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ భూములను రాకొండ కమిషనరేట్‌కు కేటాయించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. కమిషనరేట్‌కు తాము వ్యతిరేకం కాదని ఓటర్‌ రింగ్‌ రోడ్డు పరిసరాల్లో ప్రభుత్వ భూములు కావాల్సినంత ఉన్నాయన్నారు. అక్కడ నిర్మిస్తే ఎవరికీ ఇబ్బందులు ఉండవని తెలిపారు. దీనిపై ప్రభుత్వ జీవోలను రద్దు చేసే వరకు తాము పోరాడుతామని, పోరాడే వారికి మద్దతు ఇస్తామని కోదండదాం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement