కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం బస్వాపూర్ వద్ద కోదండరామ్ యాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
బిక్నూర్: కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం బస్వాపూర్ వద్ద కోదండరామ్ యాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కోదండరామ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో అమరుల స్పూర్తి యాత్ర నిర్వహించేందుకు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం వచ్చారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలకు సర్ధిచెప్పేందుకు కోదండరాం ప్రయత్నిస్తున్నారు.
నిర్భంధించిన పోలీసులు
కోదండరామ్ స్పూర్తి యాత్రను భిక్కనూరులో పోలీసులు అడ్డుకున్నారు. వాహనాలకు అనుమతులు లేవని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై వేచి చూసిన ఆయన స్వయంగా మాట్లాడేందుకు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. తిరిగి బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు గేట్లు మూసివేసి నిర్బంధించారు. పోలీసు స్టేషన్ ఆవరణలోనే చెట్టు కింద కూర్చున్న కోదండరామ్ నిరసన తెలిపారు. అనుమతి లేని మార్గంలో వచ్చారని, వాహనాలు కూడా ఎక్కువ తెచ్చారని సీఆర్పీసీ 151 కింద కేసు నమోదు చేశారు. సాయంత్రానికి కోదండరామ్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.