‘ఒరిజినల్స్‌’ అవసరంలేదు

Khammam CP Tafseer Iqbal Inspects Constable Selection Process - Sakshi

ఏడోరోజు 1152మంది మహిళా అభ్యర్థుల హాజరు 

సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌  

ఖమ్మంక్రైం: పోలీస్‌ ఉద్యోగాల ఎంపికలో భాగంగా దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమకు సంబంధించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకురావాల్సిన అవసరం లేదని సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ అన్నారు. సోమవారం ఖమ్మంలోని పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులు ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే ముందుగానే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోని రావాలన్నారు. పార్టు–2 అప్లికేషన్‌ అడ్మిట్‌ కార్డుతో పాటు ఏజెన్సీ కుల ధ్రువీకరణ పత్రాలకు సంబం«ధించిన జిరాక్స్‌కాపీలను ఈవెంట్స్‌కు తీసుకురావాలన్నారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మంచినీటి సదుపాయం, అంబులెన్స్‌తోపాటు ప్రాథమిక వైద్య పరీక్షల కోసం వైద్యులను అందుబాటులో ఉంచామన్నారు. ఏడోరోజు ఈవెంట్స్‌కు 1152మంది మహిళా అభ్యర్థులు హాజరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీలు మురళీధర్, శ్యామ్‌సుందర్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top