పెరగనున్న కాళేశ్వరం అంచనా వ్యయాలు

Kaleshwaram Project Cost May Go Up - Sakshi

మేడిగడ్డ బ్యారేజీ రూ.2,591 కోట్ల నుంచి 4,583 కోట్లకు

అన్నారం రూ.1,785 కోట్ల నుంచి రూ.2,795 కోట్లకు

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల్లోని బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల అంచనా వ్యయాలు పెరగనున్నాయి. అంచనాలు వేసిన సమయానికి, ప్రస్తుతానికి స్టీలు, సిమెంట్‌ ధరల్లో పెరుగుదల జరగడం, అదనంగా అనేక నిర్మాణాలు చేయాల్సి రావడంతో వ్యయాలు పెరిగాయి. మేడిగడ్డ అంచనా వ్యయం మొదటగా రూ.2,591 కోట్లు ఉండగా, ప్రస్తుతం అక్కడ ఫ్లడ్‌బ్యాంకులు, ఇతర నిర్మాణాలు పెరిగి, మట్టి, కాంక్రీట్‌ పనులు పెరగడంతో వ్యయం రూ.4,583 కోట్లకు చేరింది.

అన్నారం బ్యారేజీ వ్యయం మొదట రూ.1,785కోట్లు ఉండగా, దాన్ని రూ.2,795 కోట్లకు సవరిస్తూ ప్రతిపాదనలు అందాయి. ఎల్లంపల్లి దిగువన ఉన్న ప్యాకేజీ–7 అంచనా వ్యయం రూ.1,502 కోట్లు ఉండగా, రూ.2,030 కోట్ల మేర పెరగనుంది. ప్యాకేజీ–8 అంచనా వ్యయం రూ.5,166 కోట్లు ఉండగా, పలు నిర్మాణాల కారణంగా వ్యయం రూ.6,897 కోట్లకు చేరనుంది. పెరిగిన వ్యయాలకు నీటిపారుదలSశాఖ రాష్ట్రస్థాయి స్థాయీ సంఘంలో చర్చించి ఆమోదించిన తర్వాత ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top