గొప్పల కోసమే 'ఆసరా' పథకం | K. Lakshman takes on KCR government due to Aasara program | Sakshi
Sakshi News home page

గొప్పల కోసమే 'ఆసరా' పథకం

Nov 18 2014 11:44 AM | Updated on Mar 29 2019 9:00 PM

గొప్పల కోసమే 'ఆసరా' పథకం - Sakshi

గొప్పల కోసమే 'ఆసరా' పథకం

తెలంగాణ ప్రభుత్వ పెద్దలు గొప్పల కోసమే ఆసరా పథకాన్ని ప్రారంభించారని బీజేపీ శాసనసభ పక్ష నేత డాక్టర్ కె. లక్ష్మణ్ ఆరోపించారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పెద్దలు గొప్పల కోసమే ఆసరా పథకాన్ని ప్రారంభించారని బీజేపీ శాసనసభ పక్ష నేత డాక్టర్ కె. లక్ష్మణ్ ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద లక్ష్మణ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో 4 లక్షల 60 వేల మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.

మహిళలు పింఛన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని వెల్లడించారు. అర్హులైన వారికి పింఛన్లు అందడం లేదని లక్ష్మణ్ అవేదన వ్యక్తం చేశారు. అర్హులందరికి పింఛన్లు అందేవరకు పోరాడతామని చెప్పారు. అలాగే పింఛన్ల అంశంపై సభలో చర్చ చేపట్టేందుకు తాము పట్టుబడతామని లక్ష్మణ్ స్పష్టం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement