కోరుట్ల కాంగ్రెస్‌ అభ్యర్థిగా జువ్వాడి నర్సింగరావు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌ : కాంగ్రెస్‌ పార్టీ కోరుట్ల అభ్యర్థిగా జువ్వాడి నర్సింగరావును అధిష్టానం ఆదివారం రాత్రి ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 13 స్థానాలకుగాను 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ హుస్నాబాద్‌ను సీపీఐకి అప్పగించింది. హుజూరాబాద్, కోరుట్ల స్థానాల పై పదిరోజులుగా సస్పెన్స్‌ కొనసాగుతోంది. టీపీసీసీ ఎన్నికల కమిటీ సిఫార్సు మేరకు హుజూరాబాద్‌ను కౌశిక్‌రెడ్డికి.. కోరుట్ల జువ్వాడి నర్సింగరావుకు కేటాయించారు.  

నర్సింగరావు ప్రొఫైల్‌..
పేరు : జువ్వాడి నర్సింగరావు
పుట్టిన తేదీ : 04/04/1962
తల్లిదండ్రులు : రత్నాకర్‌రావు, సుమతి
భార్య :  రజని
విద్యార్హతలు : ఎంబీఏ
స్వగ్రామం : తిమ్మాపూర్, ధర్మపురి మండలం(ప్రస్తుత నివాసం హైదరాబాద్‌)

రాజకీయ ప్రవేశం : 2005 నుంచి 2007 వరకు ఏపీఐఐసీ డైరెక్టర్‌గా పనిచేశారు. 1996 నుంచి కాంగ్రెస్‌లో క్రియాశీలక కార్యకర్తగా పని చేస్తున్నాడు. 2014 ఎన్నికల్లో కోరుట్ల నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్‌ అధిష్టానం టికెట్‌ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి రెండో స్థానంలో నిలిచారు. తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో తెరాసలో చేరారు. టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి రాకపోవడంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top