జస్టిస్ కక్రూను వెంటనే తొలగించాలి | Justice kakroo should be removed immediately | Sakshi
Sakshi News home page

జస్టిస్ కక్రూను వెంటనే తొలగించాలి

Sep 19 2014 3:55 AM | Updated on Sep 2 2017 1:35 PM

విధులకు హాజరు కాకుండానే జీత భత్యాలు, ఇతర సౌకర్యాలను అనుభవిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ

తెలంగాణ న్యాయవాదుల సంఘం డిమాండ్
 సాక్షి, హైదరాబాద్: విధులకు హాజరు కాకుండానే జీత భత్యాలు, ఇతర సౌకర్యాలను అనుభవిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూను వెంటనే తొలగించాలని తెలంగాణ న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. ఉన్నత పదవిలో ఉన్నా అనైతికంగా ప్రవర్తిస్తున్నారని, చైర్మన్‌గా ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగే అర్హత ఆయనకు లేదని మండిపడింది. సంఘం అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ నేతృత్వంలో న్యాయవాదులు గురువారం కమిషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement