సోషల్‌ మీడియాపై ఆధారపడరాదు

Journlists Dont Dippend On Social Media Professor Anantha Bobbili - Sakshi

పంజగుట్ట: సెల్ఫ్‌ జర్నలిజం చేసేవారు నిజాలను తప్పులుగా రాస్తున్నారని సామాజిక మాధ్యమాలపై జర్నలిస్టులు ఆధారపడరాదని అమెరికా టెక్సాస్‌లోని ఏ అండ్‌ ఎం విశ్వవిద్యాలయంలో కమ్యునికేషన్స్‌ అండ్‌ మీడియా ప్రొఫెసర్‌ అనంత ఎస్‌ బొబ్బిలి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యునికేషన్‌ విభాగం, ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ‘రెప్రజెంటేషన్‌ అండ్‌ మిశ్రప్రిజెంటేషన్‌ ఇన్‌ జర్నలిజం – కరెంట్‌ చాలెంజెస్‌ టు డెమోక్రసీ’ అనే అంశంపై జర్నలిజం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్తలు రాసేముందు రాయబోయే అంశాన్ని ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని, ప్రధానంగానిజాలు తెలుసుకోకుండా రాయకూడదన్నారు. ఓయూ జర్నలిజం విభాగాధిపతి ప్రొఫెసర్‌ స్టీవెన్సన్, ప్రెస్‌క్లబ్‌ ప్రధాన కార్యదర్శి రాజమౌళి చారి పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top