లింగంపల్లి నుంచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ | Janmabhoomi Express Extended Up To Lingampally | Sakshi
Sakshi News home page

లింగంపల్లి నుంచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌

Apr 16 2019 9:31 AM | Updated on Apr 16 2019 9:33 AM

Janmabhoomi Express Extended Up To Lingampally - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలు లింగంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి ప్రారంభమైంది. లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సోమవారం ఉదయం 6.15 గంటలకు బయల్దేరిన రైలు వైజాగ్‌కు సాయంత్రం 7.30 గంటలకు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి కొనసాగిన ఈ రైలును లింగంపల్లి నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులు పొడిగించారు.

ఇప్పటికి లింగంపల్లి నుంచి నారాయణాద్రి, కాకినాడ, గౌతమి, హంసఫర్, అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా జన్మభూమి కూడా వాటి జాబితాలో చేరింది. లింగంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల శేరిలింగంపల్లి మున్సిపల్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ తాడిబోయిన రామస్వామి యాదవ్‌ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ప్రయాణికులకు సికింద్రాబాద్‌ వరకు వెళ్లే ఇబ్బందులు తొలుగుతాయని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement