'జానారెడ్డిది సీటు కోసం ఆరాటం' | jana reddy waiting for seat, says harish rao | Sakshi
Sakshi News home page

'జానారెడ్డిది సీటు కోసం ఆరాటం'

Sep 29 2014 8:01 PM | Updated on Mar 28 2018 11:05 AM

'జానారెడ్డిది సీటు కోసం ఆరాటం' - Sakshi

'జానారెడ్డిది సీటు కోసం ఆరాటం'

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేత జానారెడ్డి పదవుల కోసం పాకులాడుతున్నారని మంత్రులు హరీష్రావు, మహేందర్ రెడ్డి విమర్శించారు.

వికారాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేత జానారెడ్డి పదవుల కోసం పాకులాడుతున్నారని మంత్రులు హరీష్రావు, మహేందర్ రెడ్డి విమర్శించారు. పొన్నాలది పదవి కోసం ఆరాటం, జానారెడ్డి సీటు కోసం ఆరాటం అంటూ ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో రైతు బజార్ ను మంత్రులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సర్వే జరుగుతోందన్నారు. టీఆర్ఎస్ ప్రతీ కార్యకర్తను ఆదుకుంటామని మంత్రులు హామీయిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement