ఆర్టీసీపై ‘ఇరాన్‌ ఎఫెక్ట్‌’ | Iran Effect On TSRTC | Sakshi
Sakshi News home page

ఆర్టీసీపై ‘ఇరాన్‌ ఎఫెక్ట్‌’

Jan 8 2020 4:40 AM | Updated on Jan 8 2020 4:40 AM

Iran Effect On TSRTC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇరాన్‌ పరిణామాలతో ఆర్టీసీ బెంబేలెత్తుతోంది. అమెరికా –ఇరాన్‌ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుండటంతో చమురు ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఫలితంగా గత నెలాఖరు నుంచి ఇప్పటివరకు డీజిల్‌ ధరల్లో లీటరుపై రూ.1.44 మేర పెరుగుదల నమోదైంది. దీంతో ఆర్టీసీ ఆందో ళన చెందుతోంది. వారం రోజుల్లో పెరిగిన ధరల వల్ల సాలీనా డీజిల్‌ భారంలో రూ.40 కోట్ల పెరుగుదల నమోదైనట్టు లెక్కలేశారు. ఈ పెరుగుదల కొనసాగే అవకాశం ఉండటంతో భారం మరింత పెరుగుతుందంటున్నారు అధికారులు.

Advertisement
 
Advertisement
Advertisement