తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఏసీబీసలో పనిచేస్తున్న చారుసిన్హా పోలీసు ట్రైనింగ్ ఐజీగా స్థానచలనం పొందారు.
హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఏసీబీసలో పనిచేస్తున్న చారుసిన్హా పోలీసు ట్రైనింగ్ ఐజీగా స్థానచలనం పొందారు. పోలీసు ట్రైనింగ్ నుంచి గ్రేహౌండ్స్ ఐజీగా శ్రీనివాసరెడ్డి బదిలీ అయ్యారు. ఇక రాష్ట్ర డీజీపీ, ఐజీపీగా ఉన్న అనురాగ్ శర్మకు ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలను ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీచేసింది.