రోడ్డు ప్రమాదంలో  పోలీసులకు గాయాలు  

Injuries To Police In The Road Accident - Sakshi

బిజినేపల్లి రూరల్‌ (నాగర్‌కర్నూల్‌) : ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు పంది అడ్డు రావడంతో ఢీకొని కిందపడి గాయపడ్డారు. ఈ సంఘటన పాలెం గ్రామ సమీపం లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కోర్టు కేసులో ఎవిడెన్స్‌ కోసం పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌కు చెం దిన రాఘవేంద్ర, పవన్‌లు సోమవారం మ ధ్యాహ్నం ద్విచక్రవాహనంపై మహబూబ్‌నగర్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో పాలెం గ్రామ సమీపం లో పంది అడ్డు రావడంతో అదుపుతప్పి కిందపడ్డారు.ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల ను నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు. వి ష యం తెలుసుకున్న ఏఎస్పీ జోగుల చెన్న య్య, డీ ఎస్పీ లక్ష్మీనారాయణ ఆస్పత్రిలో చికి త్స పొందుతున్న వారిని పరామర్శించారు. వైదు ్యలను అడి గి వివరాలు తెలుసుకున్నారు. 

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని..  

కేటీదొడ్డి (గద్వాల) : ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని మల్లాపురం శివారులో చోటుచేసుకుంది. కుచినెర్ల గ్రామానికి చెందిన జంగం రఘు, రాముడు ద్విచక్రవాహనంపై డ్యాం నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన చిన్న దస్తగిరి ఆయన భార్యతో కలిసి కుచినెర్ల నుంచి గద్వాలకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో దస్తగిరి కాళ్లు విరగగా, జంగం రఘు, రాముడుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108లో కర్ణాటక రాష్ట్రం రాయిచూర్‌ ఆస్పత్రికి తరలించారు.

కారు, బైక్‌ ఢీకొని

బిజినేపల్లి రూరల్‌ (నాగర్‌కర్నూల్‌): మండ లంలోని మంగనూర్‌లో ఎదురెదురుగా కారు, ఇన్నోవా ఢీకొని ఇరువురు డ్రైవర్లు గాయాలపాలై ఆస్పత్రికి చేరారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మంగనూర్‌ గ్రామానికి చెందిన ఉప్పరి నరేష్‌ కారులో బిజినేపల్లికి వస్తుండగా బిజినేపల్లి నుంచి మంగనూర్‌కు వెళ్తున్న ఇన్నోవా ఢీకొనడంతో ఇరువురు డ్రైవర్లకు గాయాలయ్యాయి. బాటసారులు గమనించి ఇద్దరిని చికిత్స కోసం నాగర్‌కర్నూల్‌కు తరలించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top