మౌలిక వసతుల కల్పనకు కృషి | Sakshi
Sakshi News home page

మౌలిక వసతుల కల్పనకు కృషి

Published Sat, Apr 7 2018 2:28 PM

Infrastructure will be provided - Sakshi

రాయికల్‌(జగిత్యాల): మండలంలోని ఆలూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అదనపు తరగతి గదులను ప్రారంభించి మాట్లాడారు. గ్రామస్తుల సహకారంతో బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం అభినందనీయమన్నారు.

పాఠశాలలో మౌలిక వసతులకోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన వైద్యులు డాక్టర్‌ గురువారెడ్డి, మల్లారెడ్డి, అమిత్, బోగ ప్రవీణ్, శ్రీనివాస్‌లను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలోతహసీల్దార్‌ హన్మంతరెడ్డి, ఎంపీడీవో శివాజీ, సర్పంచ్‌ మెక్కొండ రాంరెడ్డి, ఎంపీటీసీ రాజేశ్‌యాదవ్, ఎంఈవో గంగాధర్‌   పాల్గొన్నారు.

Advertisement
Advertisement