ఆదాయం కోసం వ్యాపారులను ఇబ్బంది పెట్టం | Income for the merchants from not be troubling | Sakshi
Sakshi News home page

ఆదాయం కోసం వ్యాపారులను ఇబ్బంది పెట్టం

Jun 17 2016 2:42 AM | Updated on Aug 20 2018 2:21 PM

ఆదాయం కోసం వ్యాపారులను ఇబ్బంది పెట్టం - Sakshi

ఆదాయం కోసం వ్యాపారులను ఇబ్బంది పెట్టం

ఆదాయం కోసం మద్యం వ్యాపారులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి టి. పద్మారావుగౌడ్ స్పష్టం చేశారు.

తెలంగాణ రెస్టారెంట్, బార్ల అసోసియేషన్‌కు ఆబ్కారీ శాఖ మంత్రి పద్మారావు హామీ
సాక్షి, హైదరాబాద్: ఆదాయం కోసం మద్యం వ్యాపారులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి టి. పద్మారావుగౌడ్ స్పష్టం చేశారు. బార్ల లెసైన్సు ఫీజు పెంపు, కొత్త లెసైన్సుల జారీ నిబంధనల మేరకే జరుగుతోందని హామీ ఇచ్చారు. తెలంగాణ రెస్టారెంట్ అండ్ బార్ లెసైన్సీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. మనోహర్ గౌడ్ నేతృత్వంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన బార్ల యజమానులు గురువారం సచివాలయంలో మంత్రి పద్మారావును కలిశారు.

కొత్త బార్ పాలసీలో లెసైన్సు ఫీజులను మరో రూ.5లక్షల వరకు పెంచాలన్న ఆబ్కారీశాఖ  ప్రతిపాదనలను బార్ల యజమానులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఇప్పటి వరకు బార్ల లెసైన్స్ రెన్యూవల్ ఫీజు రూ. 10వేలు ఉంటే దానిని లక్షకు పెంచారని, కొత్త బార్ విధానంలో ఏకంగా లెసైన్సు ఫీజునే పెంచే ప్రతిపాదనలను అధికారులు చేశారని వివరించారు. ఈ ఏడాది లెసైన్స్ ఫీజు పెంచితే భరించే పరిస్థితిలో బార్ల యజమానులు లేరన్నారు. దీనిపై స్పందించిన మంత్రి.. తాను అమెరికాలో ఉన్నందు వల్ల ఆబ్కారీ శాఖ ప్రతిపాదనలు తన దృష్టికి రాలేదన్నారు. కొత్త బార్ పాలసీలో వ్యాపారులకు ఇబ్బంది లేని విధంగా నిర్ణయాలు ఉంటాయని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement