మెరుగైన సేవల కోసమే కమిషనరేట్


మహిళలకు రక్షణ, భద్రత కల్పిస్తాం

షీ టీంలు బలోపేతం చేస్తాం

రౌడీలపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం

రూరల్ కార్యాలయం ఏర్పాటుపై చర్చలు

రాజకీయ పెత్తనంపై పరిశీలన  

ఫ్రెండ్లీ, కమ్యూనిటీ  పోలీసింగ్‌ను

ప్రోత్సహిస్తాం : సుధీర్‌బాబు

వరంగల్ క్రైం :
వరంగల్ నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కమిషనరేట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజల రక్షణే లక్ష్యంగా తాను విధులు నిర్వహిస్తానని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు.  వరంగల్ నగర తొలి పోలీస్ కమిషనర్‌గా  జి.సుధీర్‌బాబు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత హైదరాబాద్, సైబరాబా ద్ కమిషనరేట్‌తోపాటు వరంగల్ నగరాన్ని కమిషనరేటుగా ప్రకటిస్తూ ఈ ఏడాది జనవరి నెల 25న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సుధీర్‌బాబుకి డీఐజీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ నగర పోలీసు కమిషనర్‌గా బదిలీ చేసింది. శుక్రవారం ఉదయం పోలీసు కమిషనరేటు కార్యాలయూనికి చేరుకున్న ఆయన పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తన కార్యాలయంలో వరంగల్ అర్బన్ ఇన్‌చార్జి ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంబర్ కిషోర్‌ఝా నుంచి వరంగల్ నగర కమిషనర్‌గా సుధీర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, వరంగల్ నగర కమిషనరేట్ అడిషనల్ డీసీపీ యాదయ్య, ఓ ఎస్‌డీ సన్‌ప్రీత్‌సింగ్‌తోపాటు వరంగల్ కమిషనరేట్‌కు చెందిన ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐ, సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఎస్‌ఐ, పోలీసు అధికారుల సంఘం, పరిపాలన సిబ్బంది నూతన కమిషనర్‌కు పుష్పగుచ్ఛాలు అందించారు.



ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ప్రోత్సహిస్తాం..

రాణిరుద్రమదేవి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధీర్‌బాబు మాట్లాడారు. రాబోయే రోజుల్లో కమిషనరేట్ స్థాయిలో పోలీసులు తమ విధులు నిర్వహిం చడం జరుగుతుందన్నారు. ఇందుకోసం వరంగల్ పట్టణ ప్రజల సహకారం అవసరమని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తోపాటు కమ్యూనిటీ పోలీసింగ్ విధానాన్ని ప్రోత్సహించ డం జరుగుతుందని తెలిపారు. మహిళల భద్రత కోసం ‘షీ’ టీంలను బలోపేతం చేస్తామన్నారు.



ఏసీపీ, డీసీపీలను పెంచుతాం..

దేశవ్యాప్తంగా పోలీసు పరంగా చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష జరిపి వరంగల్ కమిషనరేట్‌కు స్వీకరిస్తామని పేర్కొన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమం కోసం కృషి చేయడంతోపాటు విధుల్లో రాణిస్తున్న వారిని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. కమిషనరేట్ పరిధిలో డీసీపీ, ఏసీపీలను నియమించడంతోపాటు ఠాణాల సంఖ్యను పెంచి.. అందుకు తగ్గట్టుగా సిబ్బందిని ఏర్పాటు చేసి విధులు నిర్వహిస్తారని తెలిపారు. వరంగల్ నగర పోలీసు కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కమిషనర్ వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఇరువురు పోలీసు అధికారులు కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలపై విషయాలపై చర్చించారు.



రాజకీయ జోక్యంపై పరిశీలన

పోలీసుల విషయాల్లో రాజకీయ జోక్యంపై పరి శీలిస్తామని కమిషనర్ అన్నారు. ఇటీవల పోలీ సు విషయాల్లో రాజకీయ జోక్యం అతిగా ఉం దని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరూ జవాబుదారీగా ఉండాలని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా... అతిగా రాజకీయ జోక్యం ఉంటే అలాంటి ఇబ్బంది ఉంటుందన్నారు.



రౌడీలపై ఉక్కుపాదం

నగర పరిధిలోని రౌడీలపై ఉక్కుపాదం మోపుతామని, కరడు కట్టిన రౌడీలపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఆయా స్టేషన్‌లవారీగా రౌడీలతోపాటు అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడేవారిపై నిఘా ఉంటుందన్నారు. గుడుంబాను అణచివేయడానికి అన్ని రకాల చర్యలు చేపడతామన్నారు.

 

నగర పరిధిలో రూరల్ కార్యాలయంపై పరిశీలన


తాను ఇప్పుడే విధుల్లో జాయిన్ అయ్యాయని రూరల్ కార్యాలయం నగర పరిధిలో ఏర్పాటు చేయడానికి అధికారులతో మాట్లాడతాననన్నా రు. రూరల్ కార్యాలయ ఏర్పాటుపై ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు కమిషనర్‌పై విధంగా స్పందిం చారు. అదేవిధంగా కానిసేబుళ్ల బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని, పోలీసు సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉంటానని అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top