రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండల పరిధిలో అక్రమ లేఔట్లను గురువారం అధికారులు తొలగించారు.
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండల పరిధిలో అక్రమ లేఔట్లను గురువారం అధికారులు తొలగించారు. అనుమతులు లేకుండా వేసిన లేఔట్లను వికారాబాద్ డివిజన్ ఈవోఆర్డీ పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈవోఆర్డీ ఆధ్వర్యంలో అధికారులు బోర్డులను, హద్దు రాళ్లను తొలగించారు. అనుమతులు లేకుండా లేఔట్లు వేస్తే కఠినచర్యలు తీసుకుంటామని రియల్టర్లను హెచ్చరించారు.