అన్నం కావాలా..‘అన్నపూర్ణ’ను అడగండి: సీఎస్‌

If Any One Meal Required Contact GHMC Call Center Number - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్న సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు 300 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా రోజూ 2 లక్షల మందికి ఉదయం, సాయంత్రం భోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. ఎక్కడైనా భోజనం అవసరం ఉంటే జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌ నంబర్‌ 21111111 కు సంప్రదించాలని కోరారు. జీహెచ్‌ఎంసీ యాప్‌ ద్వారా కూడా ఆహారాన్ని కోరవచ్చు అన్నారు.

పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌తో కలసి శుక్రవారం ఆయన టోలిచౌకిలోని అన్నపూర్ణ కేంద్రాన్ని సందర్శించారు. వండిన ఆహారాన్ని అవసరమైన చోటకు తరలించేందుకు ప్రతీ సర్కిల్‌లో ఒక ప్రత్యేక వాహనాన్ని సిద్ధంగా ఉంచామని సీఎస్‌ తెలిపారు.  భోజనం విషయమై ప్రభుత్వానికి తగు సహకారం అందించాలని, అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top